భారతదేశం, ఆగస్టు 24 -- ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో శాంసంగ్ ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే మీకు గుడ్‌న్యూస్ ఉంది. గత ఏడాది లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎం05 లాంచ్ ధర కంటే చౌకగా వస్తుంది. ఈ ఫోన్ అసలు ధర రూ.9999 ( మింట్ గ్రీన్, 4 జీబీ + 64 జీబీ)గా ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ అమెజాన్‌లో రూ.6499కు అందుబాటులో ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎం05 ఫోన్ మీద రూ.194 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఈఎంఐ రూ.315 నుంచి మెుదలు అవుతుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో ఫోన్ ధరను మరింత తగ్గించుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో వచ్చే డిస్కౌంట్ మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎం05లో 720x1600 పిక్సెల్ రిజల్యూషన్ తో 6.7 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ ప్యానెల్‌ను చూడవచ్చు. ఫోన్‌లో అందించే ఈ డిస్‌ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 4 జీబ...