భారతదేశం, డిసెంబర్ 14 -- ఒక్క రోజులోనే హైదరాబాద్​లోని ఫేమస్​ ప్లేసులను చూడాలనుకుంటున్నారా.? అతి తక్కువ టికెట్ ధరతోనే ఈ అవకాశాన్ని కల్పిస్తోంది తెలంగాణ టూరిజం. టూరిస్టుల కోసం ప్రత్యేక ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. సిటీ మొత్తం కవర్​ చేసేలా ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది.

ఈ టూర్ ప్యాకేజీ​ ప్రతిరోజూ అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీలో భాగంగా బిర్లా మందిర్, చౌమహాల్లా ప్యాలెస్, చార్మినార్, మక్కా మసీదు, లాడ్ బజార్లో షాపింగ్ సహా ఇతర ప్రదేశాలు ఎంజాయ్​ చేయవచ్చు. నిజాం జూబ్లీ పెవిలియన్, గొల్కోండ ఫోర్ట్, కుతుబ్ షాహీ టూంబ్స్, లుంబినీ పార్క్ కవర్ అవుతాయి. ఏసీ, నాన్ఏసీ బస్సుల ద్వారా ప్రయాణం ఉంటుంది. https://tgtdc.in/ వెబ్ సైట్ ద్వారా ముందుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలి.

హైదరాబాద్ సిటీ వన్ డే ట్రిప్‌ ధరలు చూస్తే.. రెగ్యూలర్ ఛార్జీలు(ఏసీ కోచ్) అయితే పెద్దలకు ...