Hyderabad, జూలై 20 -- మొగలి రేకులు సీరియల్‌తో విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న ఆర్కే సాగర్ చాలా కాలం గ్యాప్ తర్వాత సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆర్కే సాగర్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ది 100. ఓ బాధ్యతాయుతమైన పోలీస్ డ్రామాగా ది 100 సినిమాను తెరకెక్కించి తన మొదటి చిత్రంతోనే దర్శకుడిగా ప్రేక్షకుల మన్ననలు పొందారు డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ శశిధర్.

జూలై 11న థియేటర్లలో విడుదలైన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌ ది 100 మూవీకి వస్తున్న ఆదరణపై డైరెక్టర్ రాఘవ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ తన మనసులోని భావాలను పంచుకున్నారు.

ది 100 డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ శశిధర్ మాట్లాడుతూ.. "ఈ సినిమా కేవలం పోలీస్ కథ మాత్రమే కాదు. భావోద్వేగం, బాధ్యత, నీతితో కూడిన కథ. ఇందులో నిజాయితీ గల పోలీస్ అధికారి బాధ్యత, బాధ, న్యాయం కోసం పోర...