భారతదేశం, జూలై 21 -- సీపీఐ(ఎం) వ్యవస్థాపక తరంలో బతికి ఉన్న తక్కువ మంది వ్యక్తుల్లో ఒకరైన కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్(101) కన్నుమూశారు. గత నెల 23వ తేదీన గుండెపోటుతో తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అచ్యుతానందన్ చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమించడతో సోమవారం మృతి చెందారు.

వీఎస్ అచ్యుతానందన్ కేరళ రాజకీయాల్లో ఒక గొప్ప వ్యక్తి. 2019 అక్టోబర్లో స్ట్రోక్ వచ్చినప్పటి నుండి పెద్దగా కనిపించడం లేదు. అలప్పుజ జిల్లా పున్నప్రాలో 1923 అక్టోబర్ 20న జన్మించిన వెల్లికాత్ శంకరన్ అచ్యుతానందన్ 2006 నుంచి 2011 వరకు కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశారు. సామాజిక న్యాయం, కార్మికుల హక్కుల కోసం జీవితాంతం ఉద్యమించిన అచ్యుతానందన్ 1964లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్క్సిస్ట్)ను స్థాపించిన బృందంలోని సభ్యుల్లో ఒకరు.

అచ్యుతానందన్ తన రాజకీయ జీవితంలో 10 సార్...