Hyderabad, జూలై 23 -- కేరళలో అరుదైన దేవాలయాలు ఎన్నో నివసిస్తాయి. అలాంటి ప్రత్యేక ఆలయాల కోవలోనిదే 'వెళ్ళమశ్శరీ గరుడన్ కావు'. శ్రీ మన్నారాయణుని సేవలలో నిరంతరం తరించేవిగా సుదర్శన చక్రం, పాంచజన్యం (శంఖం), కౌమోదకి (గద), ఆదిశేషువు, గరుత్మంతుడు ముఖ్యమైనవిగా చెప్పుకోవాలి. శంఖం, గద శ్రీహరి హస్తభూషణాలుగా ప్రసిద్ధి. వీరిని 'నిత్య సూరి' అని పిలుస్తారు. స్వామి ఆనతి మేరకు ఎందరో లోకకంటకులను హతమార్చిన సుదర్శన చక్రానికి శ్రీ వైష్ణవ పూజా విధానంలో విశేష ప్రాముఖ్యం ఉంది.

సర్వాంతర్యామికి వాహనంగా ప్రసిద్ధి గరుత్మంతుడు. ప్రతీ విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం వద్ద వినమ్రంగా జోడించిన హస్తాలతో ఉండే వినతాసుతుని మనందరం చూస్తూనే ఉంటాం. కానీ అతనికి ప్రత్యేకంగా ఉన్న ఏకైక కోవెల మాత్రం గరుడన్ కావులో కనిపిస్తుంది. భారతదేశంలో పక్షిరాజుకు ఉన్న ఆలయం ఇదొక్కటేనని ప్రముఖ ఆధ్యాత్మికవేత...