భారతదేశం, ఆగస్టు 30 -- శాసనసభ వాయిదా తర్వాత రాష్ట్ర మంత్రివర్గం అసెంబ్లీ కమిటీ భేటీ అయింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగిన ఈ సమావేశంలో. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవోతో పాటు వరద నష్టంపై చర్చించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పరిమితి కోటాను ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీని ఆధారంగా ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించనుంది. అయితే అసెంబ్లీలో బిల్లు పెట్టిన తరువాత జీవో ఇచ్చే ఆలోచనలో సర్కార్ ఉన్నట్లు సమాచారం.

ఇక గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజహరుద్దీన్‌ల పేర్లకు ఆమోదం తెలిపింది. ఎమ్మెల్సీ రేసు నుంచి అమీర్‌ అలీఖాన్‌ను తప్పించింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల వ్యవహారంపై సుప్రీంకోర్టు తుది తీర్పును ఇవ్వాల్సి ఉ...