భారతదేశం, మే 14 -- ఫ్యాషన్ లో ట్రెండ్ సెట్ చేస్తూ హాట్ లుక్స్ తో అదరగొట్టే బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా మరోసారి ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారింది. ఫ్రాన్స్ లోని కేన్స్ నగరంలో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో ఆమె తళుక్కుమని మెరిసింది. గత కొంత కాలంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెగ్యులర్ గా పాల్గొంటోంది ఊర్వశి.

హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా మంగళవారం (మే 13) పార్టిర్ అన్ జోర్ (లీవ్ వన్ డే) సినిమా ప్రారంభోత్సవం, ప్రదర్శన కోసం రెడ్ కార్పెట్ మీద నడిచింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 కోసం రంగురంగుల దుస్తులు ధరించి, చిలుక ఆకారంలో ఉన్న క్రిస్టల్ ఎంబెడెడ్ క్లచ్ ను పట్టుకుని వచ్చింది. ఆమె ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె పట్టుకున్న చిలుక బ్యాగ్ మరింత అట్రాక్షన్ గా మారింది.

రెడ్ కార్పెట్ పై ఊర్వశి ఫోటోలు, వీడియోల...