Hyderabad, మే 21 -- జాన్వీ కపూర్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అందంగా మెరిసింది. ఆమె తన కొత్త సినిమాకు చెందిన చిత్ర బృందంతో కలిసి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు వచ్చింది. అక్కడ తన ఫ్యాషన్ స్టైల్ తో ఎంతో అందంగా కనిపించింది. ఆమె లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ లుక్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. జాన్వీ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జాన్వీ శ్రీదేవి వారసురాలిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తల్లి పేరును నిలబెట్టేలా అందంగా కనిపించడమే కాదు ఎంతో చక్కగా నటిస్తోంది కూడా. ఇప్పుడు కేన్స్ స్థాయికి చేరింది. ఆమె వేసుకున్న డ్రెస్ డీకోడ్ చేస్తున్న ఫ్యాషన్ డిజైన్లు కూడా ఉన్నారు

కేన్స్ లో ఫోటో సెషన్ కు జాన్వీ హాజరైంది. ఆమె చెక్డ్ ప్రింట్ షర్ట్, వైట్ మినీ స్కర్ట్, మ్యాచింగ్ క్రాప్ టాప్ తో కూడిన పెద్ద బ్లూమర్ జాకెట్ ధరించి...