Hyderabad, ఆగస్టు 6 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడతాయి. కేతువు వెనక్కి కదులుతుంది. కేతువు తిరోగమనం చెందినప్పుడు కొన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుంది. ప్రస్తుతం కేతువు సింహరాశిలో ఉన్నాడు, 2026 డిసెంబర్ వరకు ఇదే రాశిలో కొనసాగుతాడు.

కేతువు కూడా కొన్ని కొన్ని సార్లు శుభ ఫలితాలను ఇస్తుంది. ప్రస్తుతం సింహరాశిలో ఉన్న కేతువు పుబ్బ నక్షత్రంలో సంచారం చేస్తోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారు సమస్యల నుంచి బయటపడవచ్చు.

మేష రాశి వారికి కేతువు శుభ ఫలితాలను తీసుకురానుంది. ఈ రాశి పంచమ స్థానంలో కేతువు పుబ్బ నక్షత్రంలో సంచారం చేయడం వలన పిల్లలు విజయాలను అందుకుంటారు. సంతానానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఆర్థికపరంగా ప్రయోజనాలు ఉంటాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. శ్రమ కూడా తగ్గు...