భారతదేశం, ఆగస్టు 2 -- కేటీఆర్ పై వివాదస్పదన వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖకు షాక్ తగిలింది. కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ నెల 21లోపు క్రిమినల్‌ కేసు నమోదు చేసి నోటీసులు ఇవ్వాలని సూచించింది. కేటీఆర్‌ తరుపు న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం. ఈ ఆదేశాలను ఇచ్చింది.

నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆర్ కారణమని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో తీవ్రస్థాయిలో దుమారం చెలరేగింది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై స్పందిస్తూ మంత్రి సురేఖ మరికొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ క్రమంలోనే కొండు సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కేటీఆర్. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

హీరో నాగార్జున కుటుంబానికి సంబంధించిన అంశంలో కొండా సురేఖ తనపై అసభ్యకరమైన వ్యాఖ్యల...