భారతదేశం, నవంబర్ 20 -- ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై స్పందిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ అనుమతించడంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు.

"మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రాజకీయకక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట ఇది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నొక్కే ప్రయత్నం చేస్తుండటం దుర్మార్గం. పూర్తి పారదర్శకతతో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ లో రెండేళ్లుగా కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నది కాంగ్రెస్‌ సర్కార్‌" అని హరీశ్ రావు ఫైర్ అయ్యారు.

"హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచిన కేటీఆర్ పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా రేవంత్...