భారతదేశం, ఏప్రిల్ 17 -- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రోటోకాల్ వివాదం పాలిటిక్స్ ఘర్షణ గా మారింది. గంభీరావుపేట మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రొటో కాల్ వివాదం ఘర్షణకు దారి తీసింది. ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేరు ఎందుకు పెట్టలేదని బిఆర్ఎస్ కార్యకర్తలు అధికారులను నిలదీశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు అధికారులకు అండగా నిలిచి బిఆర్ఎస్ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని తోపులాట జరిగింది.

ఒకరిపై మరొకరు చేయి చేసుకునే పరిస్థితి తలెత్తి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అక్కడే ఉన్న పోలీసులు ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేసిన ప్రయోజనం లేకపోయింది. చివరకు బిఆర్ఎస్ కార్యకర్తలను పోల...