భారతదేశం, మే 13 -- మాజీమంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌కు నాయకత్వం అప్పగిస్తే తాను తప్పకుండా స్వాగతిస్తానని చెప్పారు. తాను పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించిన హరీష్ రావు .. ఇప్పటికే చాలా సార్లు చెప్పాను.. ఎన్ని సార్లు అడిగిన ఇదే చెప్తానని స్పష్టం చేశారు. కేసీఆర్ తమ పార్టీ అధ్యక్షుడని.. ఆయన చెప్పింది తాను తూ.చా. తప్పకుండా పాటిస్తానని హరీష్ వ్యాఖ్యానించారు. ఒక కార్యకర్తగా పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పడు శిరసావహిస్తానని హరీష్ స్పష్టం చేశారు.

హరీష్ రావు, కేటీఆర్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని.. చాలా ప్రచారం జరుగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందే హరీష్ రావు బీజేపీలోకి వెళ్తారని, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని.. సొంతంగా పార్టీ పెడతారని జోరుగా వార్తలు వచ్చాయి. ఇక సోషల్ మీడియాలో ప్...