Hyderabad, ఆగస్టు 29 -- కేజీఎఫ్ చాప్టర్ 2, సలార్ లాంటి వరుస పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ నీల్. ఇప్పుడు తన కెరీర్ లోనే చాలా పెద్ద సినిమా మీద వర్క్ చేస్తున్నాడు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాలో లీడ్ రోల్‌లో మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. దీనిని ఫ్యాన్స్, మీడియా 'ఎన్టీఆర్ నీల్' అని పిలుస్తున్నారు. అయితే తాజాగా వస్తున్న అప్డేట్ ప్రకారం ఇది ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల కంటే గొప్పగా ఉండబోతోంది.

ఎన్టీఆర్ నీల్ ఇంకా రిలీజ్‌కి చాలా టైం ఉంది. కానీ ఈ ప్రాజెక్ట్‌పై పని చేస్తున్న ఒక సోర్స్ హెచ్‌టీతో ఎక్స్‌క్లూసివ్ గా మాట్లాడారు. "ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ తో తీస్తున్న నెక్స్ట్ సినిమా ఆయన కెరీర్ లోనే చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇది ఆయన తీసిన పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్స్ అయిన కేజీఎఫ్, సలార్ కంటే క...