భారతదేశం, ఏప్రిల్ 19 -- భారత క్రికెట్ జట్టులో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు కేఎల్ రాహుల్. తన ఆటతో అందరికీ దగ్గరయ్యాడు. తన వ్యక్తిత్వంతో లక్షలాది మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. బ్యాటింగ్, వికెట్ కీపింగ్‌తో ఆకట్టుకునే ఈ స్టార్ క్రికెటర్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నాడు కేఎల్ రాహుల్. ఈ ఆటగాడికి లగ్జరీ కార్లు అంటే చాలా ఇష్టం. అతని గ్యారేజ్‌లో ఏమేం ఉన్నాయో చూద్దాం..

చాలా మంది సెలబ్రిటీల మాదిరిగానే కేఎల్ రాహుల్ కూడా ఎస్‌యూవీల పట్ల ప్రత్యేక అభిమానాన్ని కలిగి ఉన్నాడు. రేంజ్ రోవర్ వెలార్‌లో 5.0-లీటర్ సూపర్‌ఛార్జ్డ్ V8 ఇంజన్, 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉన్నాయి. ఈ కారు చాలా బాగుంటుంది.

రాహుల్ తన తొలి లగ్జరీ కార్ల జాబితాలో జర్మన్ మెర్సిడెస్-AMG C43ని కూడా చేర్చాడు. ఈ కారు సి-క్లాస్ మ...