భారతదేశం, డిసెంబర్ 25 -- వ్యవసాయం-అనుబంధ రంగాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం, రైతుల ఆదాయాన్ని పెంపొందించేలా కేంద్రం మరింతగా సహకరించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. కొబ్బరి పార్క్, ఆక్వా ల్యాబ్, మ్యాంగో బోర్డుతో సహా వ్యవసాయ విశ్వ విద్యాలయాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరారు.

ఏపీ పునర్విభజన చట్టం-2014, షెడ్యూల్ 13లో పేర్కొన్నట్టుగా రాష్ట్రంలో కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి రూ.2,585 కోట్ల అంచనాలతో డీపీఆర్‌ను వ్యవసాయ పరిశోధన, విద్య విభాగానికి సమర్పించినట్లు చెప్పారు.

మరోవైపు రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి, అన్నదాతల సంక్షేమానికి తీసుకున్న చర్యలను, అనుసరిస్తున్న విధానాలను కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి...