భారతదేశం, డిసెంబర్ 14 -- రిటైర్​ అయిన ఉద్యోగులకు సంబంధించిన పోస్ట్-రిటైర్‌మెంట్ ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ ఖండించింది. 'ఫైనాన్స్ యాక్ట్ 2025' కింద డీఏ పెంపులు, పే కమిషన్ రివిజన్‌ల వంటి ప్రయోజనాలను రద్దు చేశారనే వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది.

సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ 'ఎక్స్​' (గతంలో ట్విట్టర్) లో ఈ విషయాన్ని ప్రకటించింది.

"సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్డ్ ఉద్యోగుల డీఏ పెంపులు, పే కమిషన్ రివిజన్‌ల వంటి ప్రయోజనాలను ఫైనాన్స్ యాక్ట్ 2025 కింద ఉపసంహరించుకుందంటూ #WhatsApp లో ఒక మెసేజ్ సర్కులేట్ అవుతోంది. ఈ క్లెయిమ్ #FAKE! (అబద్ధం), " అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తెలిపింది.

ఈ తప్పుడు ప్రచారానికి కారణాన్ని కూడా ఫ్యాక్ట్​ చ...