భారతదేశం, జూలై 16 -- కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ధన్-దాన్య కృషి యోజన (PMDDKY)కు ఆమోదం తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా 1.70 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. దేశవ్యాప్తంగా 100 వ్యవసాయ జిల్లాల్లో వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధి లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. పునరుత్పాదక ఇంధనంలో NTPCకి రూ.20 వేల కోట్ల పెట్టుబడులకు కూడా కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

2025-26 నుంచి 100 జిల్లాల్లో వ్యవసాయం, అనుబంధ రంగాలను మార్చేందుకు ఏడాదికి రూ.24,000 కోట్లతో చేపట్టిన ప్రధానమంత్రి ధన్-దాన్య కృషి యోజన (PMDDKY)కు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. పునరుత్పాదక ఇంధన రంగంలో కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వ రంగ ఎన్టీపీసీ లిమిటెడ్, ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎల్సీఐఎల్)లను బలోపేతం చేసే ప్రతిపాదనలకు కేబిన...