భారతదేశం, ఏప్రిల్ 22 -- ప్రభుత్వ ఉద్యోగం కావాలని కలలు కంటున్న వారికి గుడ్‌న్యూస్. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీబీసీబీ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ కింద అర్హులైన అభ్యర్థులను మొత్తం 69 పోస్టుల్లో నియమిస్తారు. 28 ఏప్రిల్ 2025 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

ఈ నియామకంలో సైంటిస్ట్ బి, అసిస్టెంట్ లా ఆఫీసర్, సీనియర్ టెక్నికల్ సూపర్‌వైజర్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నికల్ సూపర్‌వైజర్, అసిస్టెంట్, అకౌంట్స్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ డ్రాట్స్‌మన్, జూనియర్ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, ఫీల్డ్ అటెండెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వంటి అనేక ముఖ్యమైన పోస్టులు ఉన్నాయి.

ఈ నియామకాన...