Hyderabad, సెప్టెంబర్ 11 -- సెలబ్రిటీ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ చాలా వరకు పబ్లిక్ కు దూరంగానే ఉంటారు. కానీ ఇప్పుడీ జంట ఓ విచిత్రమైన ఘటన ద్వారా వార్తల్లో నిలుస్తోంది. న్యూజిలాండ్ లోని ఓ కెఫే నుంచి ఈ జంటను బయటకు పంపించారట. అంతటి సెలబ్రిటీలకు ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా ఆశ్చర్యం కలిగించేదే. అయితే దీని వెనుక ఓ బలమైన కారణమే ఉందని చెబుతోంది ఇండియన్ వుమెన్ క్రికెట్ టీమ్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్.

ఇండియన్ వుమెన్ క్రికెట్ స్టార్ జెమీమా రోడ్రిగ్స్‌తో కోహ్లి, అనుష్కలు గంటల తరబడి మాట్లాడటే దీనికి కారణమట. నాలుగు గంటలకుపైగా వాళ్ల మీటింగ్ సాగడంతో ఇక ఉండబట్టలేక అక్కడి స్టాఫ్ వాళ్లను బయటకు పంపించినట్లు జెమీమా తెలిపింది. రీసెంట్‌గా రోడ్రిగ్స్.. మాషబుల్ ఇండియా యూట్యూబ్ ఛానెల్‌లోని 'ది బాంబే జర్నీ' లేటెస్ట్ ఎపిసోడ్‌లో కనిపించింది. అందులో ఆమె విరాట్...