భారతదేశం, డిసెంబర్ 20 -- 2026 టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టు నుంచి శుభ్‌మన్ గిల్‌ను తప్పించారు. ఇషాన్ కిషన్ బ్యాకప్ వికెట్ కీపర్‌గా జట్టులోకి తిరిగి వచ్చాడు. దీంతో జితేష్ శర్మను డ్రాప్ చేయక తప్పలేదు. ఇండియా టెస్టు, వన్డే కెప్టెన్ టీ20 ప్రపంచకప్ టీమ్ కు ఎంపిక కాకపోవడం భారత క్రికెట్ అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. 2026 టీ20 ప్రపంచ కప్ కోసం టీమ్ ను శనివారం (డిసెంబర్ 20) మధ్యాహ్నం ప్రకటించారు.

టీ20 ప్రపంచకప్ 2026 కోసం టీమిండియాను సెలక్టర్లు ఇవాళ ప్రకటించారు. 15 మందితో టీమ్ ను అనౌన్స్ చేశారు. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్.

సూర్యకుమార్ యాదవ్ (C), జస్ప్రిత్ బుమ్రా, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (WK), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ (Vc), రింకూ సింగ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్త...