భారతదేశం, ఫిబ్రవరి 14 -- అది 2017, జనవరి.. కెప్టెన్సీకి ధోని పూర్తిగా వీడ్కోలు పలికిన సమయం. అప్పటికే మహేంద్ర సింగ్ ధోని ఇండియా మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా ఎదిగాడు. దేశానికి మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. ఇండియాను నంబర్ వన్ టెస్టు టీమ్ గా నిలబెట్టాడు. అంతకంటే రెండేళ్ల క్రితమే టెస్టు క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. అయితే అప్పుడు ధోని కెప్టెన్సీని వదిలేయడం వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అప్పటికే టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికిన ధోనిపై పూర్తిగా కెప్టెన్సీ వదిలేయాలని బీసీసీఐ ఫోర్స్ తెచ్చింది. అప్పటి బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎంఎస్కే ప్రసాద్, సెలక్టర్ జతిన్ పరంజపే కలిసి ఓ షోలో ఈ విషయాలు వెల్లడించారు.

''అప్పుడు మహి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతను గంటసేపు బ్యాటింగ్ చేస్తూనే ఉన్నాడు. మేము (ఎంఎస్కే, నేను) ఒకరినొకరం చూసుకుం...