భారతదేశం, ఏప్రిల్ 21 -- కెనరా బ్యాంక్ తన కస్టమర్లకు ఆకర్షణీయమైన రివార్డులు, క్యాష్‌బ్యాక్‌లను అందించే క్రెడిట్ కార్డులను అందిస్తుంది. ఈ కార్డులు ప్రయాణం, వినోదం, భోజనంతో సహా అనేక వర్గాలలో ప్రత్యేక ఆఫర్‌లను పొందడానికి మీకు సాయపడుతాయి. కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డు పొందడానికి ఫాలో కావాల్సిన స్టెప్స్ ఏంటో చూద్దాం..

ముందుగా బ్యాంకు వెబ్‌సైట్‌కి వెళ్లి దరఖాస్తు ఫారమ్‌ల విభాగానికి వెళ్లండి. ఫారమ్‌ల జాబితాలో క్రెడిట్ కార్డ్ దరఖాస్తు ఫారమ్‌పై క్లిక్ చేయండి. మీరు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ చేసుకునే పీడీఎఫ్ ఫైల్ తెరుచుకుంటుంది. సరైన సమాచారంతో ఫారమ్ నింపండి. ఫారమ్‌తో పాటు అవసరమైన పత్రాలను సమర్పించండి.

సమీపంలోని కెనరా బ్యాంక్ శాఖను సందర్శించి, నింపిన ఫారమ్‌ను సమర్పించండి. బ్యాంకు మీ దరఖాస్తును పరిశీలించి కార్డు జారీ చేస్తుంది. మీరు కస్టమర్...