భారతదేశం, మే 14 -- అనితా ఆనంద్ కెనడా విదేశాంగ మంత్రిగా నియమితులయ్యారు. ప్రస్తుతం పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న మెలానీ జోలీ స్థానంలో ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు.

కొత్త బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆనంద్ ఎక్స్ లో మాట్లాడుతూ.. 'కెనడా విదేశాంగ మంత్రిగా నియమితులైనందుకు గౌరవంగా భావిస్తున్నాను. సురక్షితమైన, న్యాయమైన ప్రపంచాన్ని నిర్మించడానికి ప్రధాన మంత్రి మార్క్ కార్నీ, మా బృందంతో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను..' అని పేర్కొన్నారు.

28 మంది మంత్రులు, 10 మంది సహాయ కార్యదర్శులతో కూడిన 38 మంది సభ్యుల మంత్రివర్గాన్ని కార్నీ మంగళవారం ఏర్పాటుచేశారు. కొత్త క్యాబినెట్‌ వివరాలు వెల్లడించిన తరువాత కార్నీ తమ ప్రభుత్వ అగ్ర ప్రాధాన్యతలను వివరించారు. యునైటెడ్ స్టేట్స్‌తో కొత్త ఆర్థిక, భద్రతా సంబంధాలను సృష్టించడం, జీవన వ్యయాన్ని ఎదుర్కోవడం, కెనడా ఆర్థ...