భారతదేశం, నవంబర్ 24 -- తమ పౌరసత్వ చట్టంలో కీలక సంస్కరణలు తీసుకురావడానికి కెనడా సిద్ధమవుతోంది. ఈ నిర్ణయం ద్వారా, చాలా కాలంగా పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది భారతీయ మూలాలున్న కుటుంబాలకు, ఇతర విదేశాల్లో జన్మించిన కెనడియన్లకు ఊరట లభించే అవకాశం ఉంది!

నవంబర్ 21న విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. పాత నిబంధనల కారణంగా పౌరసత్వం కోల్పోయిన కెనడియన్లు తమ పిల్లలకు (విదేశాల్లో జన్మించినా లేదా దత్తత తీసుకున్నా) పౌరసత్వాన్ని అందించడానికి స్పష్టమైన మార్గం ఈ కొత్త చట్టంలో ఉంటుంది.

"కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత, గతంలో ఉన్న 'తొలి తరం పరిమితి' లేదా ఇతర పాత నిబంధనల వల్ల పౌరసత్వం లభించని వ్యక్తులకు పౌరసత్వం ఇవ్వబడుతుంది. విదేశాలలో జన్మించిన లేదా దత్తత తీసుకున్న కెనడియన్ తల్లిదండ్రులు, తమకు కెనడాతో 'గణనీయమైన సంబంధం' ఉంటే, ఈ బిల్లు అమల్లోకి వచ...