భారతదేశం, డిసెంబర్ 25 -- కెనడాలోని వైద్య వ్యవస్థలో ఉన్న లోపాలు మరో నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. తీవ్రమైన గుండెనొప్పితో విలవిలలాడుతూ ఆస్పత్రికి వెళ్లిన ఒక భారత సంతతి వ్యక్తిని వైద్యులు పట్టించుకోకపోవడంతో, ఎనిమిది గంటల పాటు ఎమర్జెన్సీ వార్డులో నరకయాతన అనుభవించి ఆయన ప్రాణాలు విడిచారు. ఈ విషాద ఘటన ఎడ్మంటన్‌లోని 'గ్రే నన్స్ కమ్యూనిటీ హాస్పిటల్'లో చోటుచేసుకుంది.

మృతుడిని 44 ఏళ్ల ప్రశాంత్ శ్రీకుమార్‌గా గుర్తించారు. వృత్తిరీత్యా అకౌంటెంట్ అయిన ప్రశాంత్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత సోమవారం ఆఫీసులో ఉన్న సమయంలో ఆయనకు అకస్మాత్తుగా గుండెలో తీవ్రమైన నొప్పి రావడంతో, ఒక క్లయింట్ ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రికి వెళ్లిన వెంటనే అక్కడ ప్రాథమిక పరీక్షలు చేసి, ఎమర్జెన్సీ వార్డులో వేచి ఉండమని సిబ్బంది చెప్పారు.

అయితే గంటలు గడుస్తున్నా వైద్య...