భారతదేశం, డిసెంబర్ 26 -- కెనడాలో ఉంటున్న భారతీయులను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఇద్దరు భారతీయులు వేర్వేరు ఘటనల్లో హత్యకు గురవ్వడం ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. టొరంటో పోలీసులు ఈ రెండు మరణాలకు ఒకదానితో ఒకటి సంబంధం లేదని చెబుతున్నప్పటికీ, వరుస హత్యలు అక్కడి ప్రవాస భారతీయులను కలవరపెడుతున్నాయి.

తాజా ఘటనలో, యూనివర్సిటీ ఆఫ్ టొరంటో స్కార్‌బరో క్యాంపస్ సమీపంలో శివాంక్ అవస్థి అనే భారతీయ పీహెచ్‌డీ విద్యార్థి దుండగుల కాల్పులకు బలయ్యారు. హైలాండ్ క్రీక్ ట్రైల్, ఓల్డ్ కింగ్‌స్టన్ రోడ్ ప్రాంతంలో ఈ షూటౌట్ జరిగింది. కాల్పుల శబ్దం విన్న స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే శివాంక్ తీవ్ర రక్తస్రావంతో మరణించారని టొరంటో సన్ పత్రిక వెల్లడించింది.

పోలీసులు వచ్చే లోపే నిందితులు అక్కడ...