భారతదేశం, నవంబర్ 4 -- ప్రపంచంలోనే అత్యధిక అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించే దేశాల్లో ఒకటైన కెనడా, భారతీయ విద్యార్థులకు భారీ షాక్ ఇచ్చింది. 2025 ఆగస్టులో భారతీయ పౌరుల నుంచి వచ్చిన ప్రతి నలుగురు స్టడీ-పర్మిట్ దరఖాస్తులలో దాదాపు ముగ్గురిని తిరస్కరించింది. ఈ పెరుగుదల వీసా మోసాల భయం వల్లా, లేదా న్యూఢిల్లీ, ఒట్టావా మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన విభేదాల వల్లా అనే చర్చకు దారితీసింది.

రాయిటర్స్ ఉటంకించిన అధికారిక ఇమ్మిగ్రేషన్ డేటా ప్రకారం, 2023 ఆగస్టులో 32% ఉన్న తిరస్కరణ రేటు, 2025 ఆగస్టు నాటికి 74%కి పెరిగింది. ఇదే సమయంలో, గ్లోబల్ స్టడీ-పర్మిట్ తిరస్కరణ రేటు రెండు సంవత్సరాలలోనూ దాదాపు 40% మాత్రమే ఉంది. ఇక చైనా దరఖాస్తుదారులకు అయితే, ఈ తిరస్కరణ రేటు కేవలం 24% మాత్రమే కావడం గమనార్హం.

అధికారిక డేటా ప్రకారం, కెనడా ఇటీవల చేపట్టిన అంతర్జాతీయ విద్యార్...