భారతదేశం, నవంబర్ 17 -- సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం వారణాసి. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా టైటిల్‌ను ఇటీవల గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో రివీల్ చేసిన విషయం తెలిసిందే.

శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ వారణాసి సినిమాను నిర్మిస్తున్నారు. అత్యంత గ్రాండ్‌గా నిర్వహించిన వారణాసి గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌కు మహేశ్ బాబు, రాజమౌళి, కీరవాణి, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారణాసి నిర్మాత కేఎల్ నారాయణ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నిర్మాత కేఎల్ నారాయణ మాట్లాడుతూ .. "పదిహేనేళ్ల క్రితం నేను మహేష్ బాబు గారి వద్దకు వెళ్లి రాజమౌళితో సినిమా చేద్దామా? అని అడిగాను. ఆయన వెంటన...