భారతదేశం, జూన్ 17 -- నటుడు ముకుల్ దేవ్ ఆకస్మిక మరణం పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించింది. ఆయన మరణానికి గల కారణాలపై విస్తృతంగా ఊహాగానాలు చెలరేగాయి. అయితే తాజాగా ముకుల్ మృతికి దారితీసిన పరిస్థితులపై ఆయన సోదరుడు, నటుడు రాహుల్ దేవ్ స్పందించారు. షాకింగ్ విషయాలను బయటపెట్టారు.

చాలా మంది ఊహించినట్లుగా ముకుల్ దేవ్ మరణానికి డిప్రెషన్ కంటే పేలవమైన ఆహారపు అలవాట్లే కారణమని రాహుల్ దేవ్ చెప్పారు. ముకుల్ మరణానికి గల కారణాలను టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ పంచుకున్నారు. ఎనిమిదిన్నర రోజుల పాటు ఆయన ఐసీయూలో ఉన్నారని రాహుల్ తెలిపారు. వైద్యపరంగా, ఇది పేలవమైన ఆహారపు అలవాట్ల ఫలితమే అని చెప్పారు.

చనిపోవడానికి నాలుగైదు రోజుల ముందు నుంచి ముకుల్ దేవ్ పూర్తిగా తినడం మానేశాడు. వాస్తవానికి అతను ఒంటరిగా కనిపించాడు. జీవితంపై ఆసక్తిని కోల్పోయాడు. అతను అనేక ఆఫ...