Delhi, జూలై 16 -- ఢిల్లీలో జలశక్తి మంత్రిత్వశాఖ తలపెట్టిన ఉన్నతస్థాయి సమావేశానికి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. జల్ శక్తిశాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ అధ్యక్షతన భేటీ జరుగుతుండగా.. గోదావరి, కృష్ణా జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చించనున్నారు.

ముఖ్యంగా పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రకటించిన నేపథ్యంలో నీటి పంపకాలపై ఇరు రాష్ట్రాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ జరుగుతున్న ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇరువురు ముఖ్యమంత్రులు పాల్గొన్న ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

కృష్ణా నదీ జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటాను సాధించేందుకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా పోరాడుతుందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆంధ్రప్రద...