Andhrapradesh,vijayawada, జూలై 30 -- విజయవాడలోని ప్రకాశం బ్యారేజి వద్ద వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతోమొత్తం 70 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 15 గేట్లను 2 అడుగుల మేర, 55 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ప్రకాశం బ్యారేజీ ఇన్ ఫ్లో 87,441 క్యూసెక్కులుగా ఉండగా. ఔట్ ఫ్లో 87,441 క్యూసెక్కులుగా ఉంది. కృష్ణా తూర్పు కాలువకు 10,207 క్యూసెక్కులు, కృష్ణా పశ్చిమ కాలువకు 5527 క్యూసెక్కులు, గుంటూరు ఛానెల్ కు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

ప్రకాశం బ్యారేజీ కి వరద పోటెత్తిన నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తతో ఉండాలని అధికారులు హెచ్చరించారు. రెవెన్యూ అధికారులు నదీ పరివాహక ప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.

గ్రామాల్లోకి నీరు చేరకుండా రెవెన్యూ అధికారులు తగ...