భారతదేశం, మే 19 -- కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా 24 గంటలు తవ్వేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఇసుక యథేశ్చగా దోపిడీకి గురవుతోంది. రాజకీయ నాయకులే రీచ్‌లను నిర్వహిస్తుండటంతో.. పోలీసులు, విజిలెన్స్ అధికారులు అటువైపు కనెత్తికూడా చూడని పరిస్థితి ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చింది. లారీకి కేవలం 20 టన్నులు మాత్రమే తరలించాలని, అదికూడా పగలు మాత్రమే తీసుకెళ్లాలని ఆదేశించింది. అనుమతి మేరకు మాత్రమే ఇసుకని తవ్వాలని స్పష్టం చేసింది. కానీ.. ఇందులో ఏ ఒక్కటీ అమలు కావడం లేదు. ముఖ్యంగా కృష్ణా నదికి అప్ స్ట్రీమ్ గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు, డౌన్ స్ట్రీమ్ కృష్ణా జిల్లాలోని రీచ్‌ల్లో ఎక్కడా నిబంధనలు అమలు కాకపోవడం గమనార్హం.

మరోవైపు కృష్ణా నదిలో గత ప్ర...