Telangana,andhrapradesh, ఆగస్టు 28 -- ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగుతున్నాయి. దీనికితోడు కృష్ణా, గోదావరిలో వరద ఉద్ధృతి మళ్లీ పెరుగుతోంది. గోదావరి బెల్ట్ తో పోల్చితే. కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులకు వరద ఉద్ధృతి ఎక్కువగా కొనసాగుతోంది.

ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి ఎక్కువగా వస్తుండటంతో. ఇవాళ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో,ఔట్ ఫ్లో 4.05లక్షల క్యూసెక్కులుగా ఉంది. కృష్ణా,గోదావరి,తుంగభద్ర నదిపరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పొంగిపొర్లే వాగులు,కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించింది.

శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 3.06, ఔట్ ఫ్లో 3.62 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఇక నాగార్జ...