భారతదేశం, జూలై 16 -- కృష్ణా నదికి సంబంధించి దీర్ఘకాలంగా కొనసాగుతున్న అంతర్రాష్ట్ర జలాల పంపకాల వివాదానికి సంబంధించి ఏర్పాటైన ట్రైబ్యునల్ విషయంలో కేంద్రం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. తుది నివేదిక, నిర్ణయం సమర్పించేందుకు కృష్ణా జలవివాదాల ట్రిబ్యునల్ కు మరోసారి గడువు ఇచ్చింది.

అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం 1956 కింద ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. ట్రిబ్యునల్ తన పనిని పూర్తి చేయడానికి మరింత సమయం కావాలని చేసిన అధికారిక అభ్యర్థనపై స్పందించిన కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

ట్రిబ్యునల్ కాలపరిమితిని గతంలో 2024 మార్చి నోటిఫికేషన్ ద్వారా 2025 జూలై 31 వరకు పొడిగించారు. కృష్ణా నదీ జలాల పంపకాలపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు 2004 ఏప్రిల్ లో ...