భారతదేశం, నవంబర్ 27 -- కృష్ణా జలాల్లో ఏపీ వాటా కోల్పోయే ప్రశ్నే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర హక్కులను పరిరక్షించడానికి నదీ జలాల వాటాను తీర్పు ఇచ్చే ట్రిబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల నీటిని పంపిణీ చేసినట్లు సీఎం తెలిపారు.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకం ఏర్పాట్లు కొనసాగాలని. అన్ని జిల్లాలకు నీటి భద్రత ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రిజర్వాయర్లలోని నీటి వనరులను న్యాయబద్ధంగా ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

రాష్ట్ర నీటి కేటాయింపుల్లో ఎలాంటి మార్పులు చేసేందుకూ వీలు లేదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. చట్టపరంగా ఏపీకి దక్కిన వాటా యథాతథంగా కొనసాగించాల్సిందేనని. దీనిపై...