భారతదేశం, అక్టోబర్ 30 -- ఎగువ భారీ వర్షాలకు కృష్ణానది వరద ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. నీటిమట్టం కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇవాళ(గురువారం) సాయంత్రం6. 30గంటల నాటికి ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5.67లక్షల క్యూసెక్కులు ఉంది. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

రేపటి నుంచి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.ఎగువ వర్షాలకు కృష్ణా నది కొన్ని రోజులు హెచ్చతగ్గులుగా ఉండే అవకాశం ఉందని వివరించింది. కృష్ణా,పెన్నా నదీపరీవాహక లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పొంగిపొర్లుతున్న ఉపనదులు, వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరించింది.

శుక్రవారం(31-10-2025) కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడా పిడు...