Telangana,andhrapradesh, మే 31 -- కొద్దిరోజులుగా ఏపీకి ఎగువన ఉన్న రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో కృష్ణమ్మ పరుగులు మొదలయ్యాయి. బేసిన్ లో ఉన్న అన్ని ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ పరిధిలోని జూరాల నిండుకుండను తలపిస్తోంది. జూరాలతో పాటు సంకుశుల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

జూరాలకు వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో. కొన్ని గేట్లు కొంత మేర పైకి ఎత్తిని నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు జూరాల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని కూడా ప్రారంభించారు. ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు.

ఇక జూరాల నుంచి కృష్ణమ్మ పరుగులు పెట్టడంతో.. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో డ్యామ్ లోని నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం (మే 31) ఉదయం...