భారతదేశం, ఆగస్టు 12 -- ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కూలీ' (Coolie) మూవీ ఒకటి. ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతోంది రజనీకాంత్ మూవీ. ఇక ఈ మూవీ మ్యూజిక్ ఇప్పటికే ట్రెండింగ్ లో కొనసాగుతోంది. సాంగ్స్ సూపర్ హిట్స్ గా నిలిచాయి. అయితే ఈ మూవీ సౌండ్ ట్రాక్ కోసం చాట్ జీపీటీ హెల్ప్ తీసుకున్నానని మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవి చందర్ తెలిపాడు.

కూలీ సౌండ్ ట్రాక్ పై పనిచేస్తున్నప్పుడు కృత్రిమ మేధస్సును ఉపయోగించి క్రియేటివ్ బ్లాక్ ను దాటడం గురించి సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఓపెన్ అయ్యాడు. ఇటీవల సన్ పిక్చర్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిరుధ్ తాను చాట్ జీపీటీని ఎలా ఆశ్రయించానో నిర్మొహమాటంగా పంచుకున్నాడు.

''రెండు ర...