Hyderabad, ఆగస్టు 11 -- వరుస సినిమాలతో దూసుకుపోతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ కూలీ. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో మొదటిసారిగా టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్‌గా యాక్ట్ చేశాడు. అలాగే, హిందీ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, కన్నడ సూపర్ స్టార్ హీరో ఉపేంద్ర, బ్యూటిఫుల్ శ్రుతి హాసన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

వీరితోపాటు మలయాళ స్టార్ యాక్టర్ సౌబిన్ షాహిర్, బుట్టబొమ్మ పూజా హెగ్డే, సత్యరాజ్ వంటి వారు కూడా నటించారు. ఇలా అతిపెద్ద తారాగణం ఉన్న కూలీ సినిమాకు విక్రమ్, లియో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. సౌత్‌లో అతిపెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన సన్ పిక్చర్స్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత కళానిధి మారన్ కూలీ సినిమాను నిర్మించారు.

ఇక ఇదివరకు విడుదలైన కూలీ టీజర్, సాంగ్స్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింద...