Hyderabad, ఆగస్టు 14 -- తలైవ రజనీకాంత్ హీరోగా టాలీవుడ్ మన్మథుడు నాగార్జున విలన్‌గా నటించిన లేటెస్ట్ సినిమా కూలీ. ఖైదీ 2, విక్రమ్, లియో చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన కూలీ సినిమాలో అమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, పూజా హెగ్డే, సత్యరాజ్ వంటి అగ్ర నటీనటులు నటించారు.

అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ కళానిధి మారన్ కూలీ సినిమాను నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన కూలీ సినిమా ఇవాళ (ఆగస్ట్ 14) థియేటర్లలో విడుదల కానుంది.

ఈపాటికే పలు చోట్ల కూలీ ప్రీమియర్ షోలు పడిపోయాయి. మరి జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌ల వార్ 2తో పోటీ పడుతున్న కూలీ ట్విటర్ రివ్యూలో నెటిజన్స్ తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు.

"కూలీ ఫస్టాఫ్ ర్యాంపేజ్‌లా ఉంది. ఈ లోకేష్ కనగరాజ్ జీనియస్. అనిరుధ్ రవిచందర్ అద్భుతమైన బీట్స...