భారతదేశం, ఆగస్టు 2 -- ఈ ఏడాది అత్యంత ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో 'కూలీ' (Coolie) ఒకటి. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ రోజు (ఆగస్టు 2) మూవీ ఈవెంట్ లో ఈ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ అదిరిపోయింది.

యాక్షన్ ప్యాక్డ్ కూలీ ట్రైలర్ వేరే లెవల్ లో ఉంది. ఇందులో స్మగ్లర్ దేవ క్యారెక్టర్ లో రజనీకాంత్ నటిస్తున్నారు. అతను ప్రతీకారం తీర్చుకునే మార్గంలో ఉన్న ఒక స్మగ్లర్ అని అర్థమవుతోంది. విలన్ గా యాక్ట్ చేస్తున్న నాగార్జున డైలాగ్ తో ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయింది. అనిరుధ్ రవిచందర్ అందించిన స్టైలిష్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్ ను మరో లెవల్ కు తీసుకెళ్లింది.

ట్రైలర్ లో రజనీకాంత్.. స్మగ్లర్ దేవగా డాషింగ్ ఎం...