Hyderabad, ఆగస్టు 8 -- లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన 'కూలీ', ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి. ఆగస్టు 14న విడుదల కానున్న ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. శుక్రవారం (ఆగస్టు 9) సినిమా నిర్మాతలైన సన్ పిక్చర్స్ తమ ఎక్స్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. అందులో కేరళలోని ఒక థియేటర్ వద్ద 'కూలీ' టికెట్ల కోసం రజినీకాంత్ అభిమానులు పరుగులు పెట్టడం చూడొచ్చు.

రజనీకాంత్ నటించిన కూలీ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ ప్రభావం అడ్వాన్స్ బుకింగ్స్ పై స్పష్టంగా కనిపిస్తోంది. కూలీ సినిమాకు కేరళలో ఉన్న క్రేజ్ గురించి చెబుతూ సన్ పిక్చర్స్ ఓ వీడియో రిలీజ్ చేసింది.

"కేరళలోని త్రిస్సూర్‌లో కూలీ అడ్వాన్స్ బుకింగ్‌కు అభిమ...