భారతదేశం, ఆగస్టు 15 -- లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన కూలీ సినిమా హీరోయిన్ శ్రుతి హాసన్ కు వింత ఘటన ఎదురైంది. ఫస్ట్ డే, ఫస్ట్ షో చూసేందుకు శ్రుతిహాసన్ గురువారం (ఆగస్టు 14) చెన్నైలోని ఓ థియేటర్ కు వెళ్లింది. ఆమె లోపలికి వెళ్ళడానికి ఉత్సాహంగా ఉన్నప్పటికీ, శ్రుతి హాసన్ ను సెక్యూరిటీ గార్డు ఆపేశాడు. ఆమె కారును లోపలికి పంపించలేదు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో వైరల్ గా మారింది.

శ్రుతి హాసన్ కారును సెక్యూరిటీ గార్డు అడ్డుకున్న విషయం వీడియోతో బయటపడింది. సింగపూర్-తమిళ ర్యాపర్ యుంగ్ రాజా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసిన వీడియోలో శ్రుతి హాసన్ కారులో కూర్చొని తన స్నేహితులతో కలిసి కూలీ షోకు వెళ్లడానికి ప్రయత్నిస్తోంది. ఆమెను గుర్తుపట్టని సెక్యూరిటీ గార్డు వారిని లోనికి రానివ్వకుండా అడ్డుకున్నాడు. శ్రుతి హాసన్ తనకు ఎవరో తెలియనట్లు ఆ...