Hyderabad, జూలై 3 -- బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్.. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'కూలీ'లో మెరిశాడు. గురువారం (జులై 3) మేకర్స్ ఆమిర్ ఖాన్ పాత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా, అది అప్పుడే సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇందులో దహాగా అతడు కనిపించనున్నాడు.

లోకేష్ కనగరాజ్, రజనీకాంత్ కాంబినేషన్ అంటేనే ఓ రేంజ్ క్రేజ్ నెలకొంది. ఇందులోకి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కూడా వచ్చి చేరాడు. దీంతో ఈ ప్రాజెక్ట్ క్రేజ్ మరో లెవెల్ కు వెళ్లింది. ఈ మూవీ మేకర్స్ అయిన సన్ పిక్చర్స్.. తమ అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో ఆమిర్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఇందులో అతనిని 'దహా' అనే పాత్రలో పరిచయం చేశారు.

ఆ లుక్‌లో ఆమిర్ ఖాన్ ఓ రఫ్, ఇంటెన్స్ లుక్స్, నల్లటి వెస్ట్ వేసుకొని, ఓ పైప్‌ను ప్రశాంతంగ...