భారతదేశం, డిసెంబర్ 23 -- అక్రమ సంబంధం కారణంగా జరిగే హత్యలు ఇటీవలి కాలంలో ఎక్కువ అయ్యాయి. ఎప్పటి నుంచో ఉన్న బంధాలను మధ్యలో వచ్చిన వారి కోసం తెంచేసుకుంటున్నారు. జైళ్లకు వెళ్తున్న ఘటనలు చూస్తున్నా.. చాలా మంది ఇలాంటి పనులను మానుకోవడం లేదు. తాజాగా ఓ యువకుడితో అక్రమ సంబంధం కారణంగా భర్తను చంపేసింది ఓ మహిళ. అంతేకాదు.. గుండెపోటు అంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ బోడుప్పల్ ఈస్ట్ బృందావన్‌ కాలనీలో కర్ణాటకకు చెందిన అశోక్ (45), పూర్ణిమ (36)లు నివాసం ఉంటున్నారు. వీరికి 2011లో పెళ్లి అయింది. 12 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అశోక్ ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుండగా.. పూర్ణిమ బోడుప్పల్‌లో ప్లే స్కూల్ నిర్వహిస్తోంది. గతంలో వేరే ప్రాంతంలో నివసించేవారు. దీనికి కారణం పూర్ణిమకు ఉన్న అక్రమ సంబంధం. ...