Hyderabad, మే 16 -- వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన విడుదల మూవీతో 2023లో లీడ్ రోల్లోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు సూరి. అంతకుముందు 25 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో చిన్నాచితకా రోల్స్ చేసుకుంటూ వచ్చిన అతనికి ఈ సినిమా పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఈ మధ్యే మామన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూరి.. 30 ఏళ్ల కిందటి తన కష్టాలను చెప్పుకున్నాడు. రోజు కూలీగా పని చేసిన తాను ఇప్పుడీ స్థాయికి చేరుకున్నట్లు వెల్లడించాడు.

తమిళ నటుడు సూరి 1998లోనే ఇండస్ట్రీలోకి వచ్చాడు. అయితే 2023లో వచ్చిన విడుదల మూవీ అతని కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ మధ్యే ఓ ఈవెంట్లో పాల్గొన్న సూరి.. 1993లో తాను రోజుకూలీగా పని చేసిన రోజులను గుర్తు చేసుకున్నాడు. అప్పట్లో రోజుకు రూ.20 సంపాదించేవాడినని, వారానికి వచ్చిన రూ.140లో రూ.70 ఇంటికి పంపించి మిగిలిన డబ్బుతో గడిపేవాడినని చెప్పాడు.

"నేను 1993లో తిరుప్పూరు...