భారతదేశం, ఆగస్టు 11 -- ఒప్పో తన రెండు ప్రత్యేక, అధునాతన ఫీచర్ల ఫోన్లు ఒప్పో కె13 టర్బో, కె13 టర్బో ప్రోలను భారతదేశంలో విడుదల చేసింది. భారతదేశంలో ఇన్‌బిల్ట్ యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ ఉన్న మొదటి ఫోన్లు ఇవే. లాంగ్ గేమింగ్ లేదా హెవీ యూజ్ సమయంలో 18,000 ఆర్పీఎమ్ వద్ద తిరగడం ద్వారా ఫోన్‌ను చల్లగా ఉంచుతుంది.

ఒప్పో కె 13 టర్బో ప్రో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది మునుపటి తరం కంటే సీపీయులో 31 శాతం మెరుగైన పనితీరును, జీపీయూలో 49శాతం మెరుగైన పనితీరును అందిస్తుంది. బేస్ మోడల్ కె13 టర్బో మీడియాటెక్ డైమెన్సిటీ 8450 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.

ఒప్పో కె13 టర్బో 8 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999 కాగా, 8 జీబీ ర్యామ్/256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999. ఆగస్టు 18 నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుండగా, లాంచ్ ఆఫర్...