భారతదేశం, సెప్టెంబర్ 2 -- బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేశారు. ఆమెపై పార్టీ వేటు వేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కవితను తక్షణమే సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి టి.రవీందర్ రావు, మరో ప్రధాన కార్యదర్శి (క్రమశిక్షణ వ్యవహారాల ఇన్‌ఛార్జి) సోమ భరత్ కుమార్ ప్రకటన విడుదల చేశారు.

ఇటీవలి కాలంలో కవిత ప్రవర్తన, ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్‌ను దెబ్బతీస్తున్నాయని కార్యకర్తల్లోనూ చర్చ ఉంది. దీనిని నాయకత్వం తీవ్రంగా పరిగణించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణంలో తన తండ్రికి అవినీతి మరకలు అంటిస్తున్నారని మాజీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులపై కవి...