భారతదేశం, జూలై 11 -- హరియాణాలోని గురుగ్రామ్‌లో రాష్ట్రస్థాయి టెన్నిస్ క్రీడాకారిణి, 25 ఏళ్ల రాధికా యాదవ్ దారుణ హత్యకు గురైన వార్త సర్వత్రా సంచలనం సృష్టిస్తోంది. గురువారం తమ నివాసంలోనే ఆమె తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు దీపక్ యాదవ్ తన కూతురిపై మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన గురువారం ఉదయం 10:30 గంటలకు కుటుంబం నివాసముంటున్న సెక్టార్ 57లోని ఇంట్లో, వంటగదిలో జరిగింది. దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెలువడ్డాయి.

పోలీసుల దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. 51ఏళ్ల దీపక్ యాదవ్ తన కుమార్తె రాధిక టెన్నిస్ అకాడమీ నడపడం పట్ల గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. వారి స్వగ్రామమైన వజీరాబాద్‌లోని చాలా మంది.. రాధిక టెన్నిస్ అకాడమీ ఆద...